telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

విజయ్ కి .. ‘ఖైదీ’ బాగా నచ్చిందట.. అందుకే ఆ దర్శకుడితో..

vijay with karthi director

తమిళ హీరో కార్తీ టాలీవుడ్ లో కొంత కాలంగా మంచి విజయాలు అందుకుంటున్నారు. ఈ దీపావళికి కార్తి హీరోగా నటించిన ‘ఖైదీ’ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ‘ఖాకీ’ తర్వాత మరో పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో వచ్చిన కార్తికి ‘ఖైదీ’ సినిమాతో మరో హిట్టును అందుకున్నాడు. దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ సినిమా కేవలం తమిళనాడులో కాకుండా తెలుగు, మలయాళ భాషలతో పాటు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ కార్తీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేస్తోంది. కేవలం చెన్నైలోనే ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.కోటి 7లక్షలు వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేరళలో ఈ సినిమా మొదటిరోజే.. రూ.45 లక్షలు, శనివారం రూ.50 లక్షలు, ఆదివారం రూ.61 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే..రూ.1.56 కోట్ల గ్రాస్ వసూళ్లు..రూ.71 లక్షల షేర్‌ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలే ‘బిగిల్’ సినిమాతో తన అభిమానులను అలరించిన విజయ్, తాజాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. తాజా షెడ్యూల్ ను ఢిల్లీలో మొదలుపెట్టారు. 40 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సీన్లను చిత్రీకరించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, వచ్చే వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. సినిమాకి హైలైట్ గా నిలిచే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. విజయ్ నటించిన బిగిల్ తెలుగు లో విజిల్ కూడా మంచి విజయం అందుకుంది..తెలుగు నాట కూడా మంచి కలెక్షన్లు సాధిస్తుంది.

Related posts