telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఆగష్టులో సినిమా హాళ్లు పునః ప్రారంభం… ఐబీ మినిస్ట్రీ సిఫారసు

Theatre

కరోనా సంక్షోభ సమయంలోనూ దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టు నెలలో పునర్ ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఐబీ మినిస్ట్రీ) తాజాగా సిఫారసు చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆగస్టులో సినిమా హాళ్లను పునర్ ప్రారంభించనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించారు. కేంద్ర కార్యదర్శితో జరిగిన సమావేశంలో సోనీ సీఈవో సం బల్సారా, మెగా టాటా (డిస్కవరి), గౌరవ్ గంధి (అమెజాన్ ప్రైమ్), మనీష్ మహేశ్వరి (ట్విట్టర్), శివకుమార్, కె. మాధవన్ (స్టార్ అండ్ డిస్నీ) లు పాల్గొన్నారు. సినిమా హాళ్ల పునర్ ప్రారంభంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తుది నిర్ణయం తీసుకుంటారని అమిత్ చెప్పారు. ఆగస్టు 1వతేదీ లేదా ఆగస్టు 31వతేదీన దేశంలోని అన్ని నగరాల్లోని సినిమా హాళ్లను పునర్ ప్రారంభించాలని తాము సిఫారసు చేశామని కేంద్ర కార్యదర్శి వెల్లడించారు. సినిమా థియేటర్లలో ఒక వరుస సీట్లను ఖాళీగా ఉంచి సామాజిక దూరం పాటించేలా సినిమా హాళ్లను పునర్ ప్రారంభించాలని తాము సూచించామన్నారు. రెండు మీటర్ల దూరం పాటించేలా సినిమా హాళ్లు నడపాలని తాము యజమానులతో మాట్లాడతామన్నారు.

Related posts