telugu navyamedia
సినిమా వార్తలు

మురుగదాస్ తో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ?

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతోపాటు మలయాళంలోనూ వీరాభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన సినిమాలన్నీ తెలుగుతోపాటు మలయాళంలోనూ విడుదలవుతుంటాయి. తమిళనాడులో కూడా తన మార్కెట్ పెంచుకోవాలన్నది బన్నీ కోరిక. ఇందుకోసం ఎప్పట్నుంచో ప్రణాళికలు రచిస్తున్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమా కూడా ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. బన్నీ ప్రస్తుతం “అల వైకుంఠపురములో…” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత “ఐకాన్”, సుకుమార్ సినిమాలను ప్రారంభిస్తాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత తమిళ అగ్రదర్శకుడు మురుగదాస్‌తో బన్నీ ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడట. ఈ మేరకు ఇప్పటికే ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్‌తో “దర్బార్” సినిమాను రూపొందిస్తున్న మురుగదాస్, ఆ సినిమా షూటింగ్ పూర్తవగానే బన్నీకి కథ చెప్పబోతున్నట్టు సమాచారం. కథ నచ్చితే వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

Related posts