telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సాయం చేయాలంటూ బీజేపీ నాయకుడికి మమతా బెనర్జీ ఫోన్

పశ్చిమ బెంగాల్‌లో నిన్న మొదటి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఓ బీజేపీ నేత సీఎం మమతా బెనర్జీపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మమతా బెనర్జీ ఈ ఎన్నికలో నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే కాగా.. టీఎంసీ మాజీ నేత.. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారికి నందిగ్రామ్‌ కంచుకోట కావడం విశేషం.. అయితే, మమతా ప్రస్తుత సిట్టింగ్‌ స్థానమైన భవానీపూర్‌ను కాదనుకొని నందిగ్రామ్‌లో పోటీచేయడం చర్చగా మారగా.. ఇప్పుడు ఒక ఫోన్‌ కాల్‌ సంభాషణ బెంగాల్ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తోంది. ఈ ఎన్నికల్లో తనకు సాయం చేయాలంటూ స్వయంగా తృణముల్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ.. బీజేపీ నాయకుడికి ఫోన్‌ చేయడం కలకలంగా మారింది.. నందిగ్రామ్‌లో సుబేందు అధికారికి అత్యంత సన్నిహితుడు, తమ్లుక్‌ ప్రాంత మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ నేత అయినటువంటి ప్రలయ్‌ పాల్‌.. ఓ ఆడియోను బయటపెట్టాడు.. ఇవాళ ఉదయం మమతా బెనర్జీ తనకు ఫోన్‌ చేశారని.. నందిగ్రామ్‌లోని తనకు ప్రచారం చేయాలని కోరారని ప్రలయ్‌ పాల్‌ ఆరోపించారు.. తనను మళ్లీ టీఎంసీలోకి రావాలని కోరారరని.. నందిగ్రామ్‌లో సుబేందు అధికారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని దీదీ కోరినట్లు చెప్పుకొచ్చాడు.

Related posts