telugu navyamedia
క్రీడలు వార్తలు

హార్దిక్ ను ఎలా వాడుకోవాలో మాకు తెలుసు : కోహ్లీ

రెండో వన్డే మ్యాచ్ లో భారత్ పై ఇంగ్లాంను విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత‌ బౌలర్లంతా ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్‌ చేయించిన కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేత బౌలింగ్ చేయించలేదు. ‘హార్దిక్ ‌పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయలేదు. అతను టీ20 సిరీస్‌లో చక్కగా బౌలింగ్ వేశాడు. రెండో వన్డేలో ఆరవ బౌలర్‌గా పాండ్యాను ఉపయోగించుకోవాల్సింది’ అని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అయితే హార్దిక్‌ చేత బౌలింగ్‌ ఎందుకు వేయించలేదనే విషయాన్ని విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘భవిష్యత్తు ప్రణాళిక దృష్యా హార్దిక్‌ను ప్రస్తుతం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేశాం. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే రానున్న రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు టీ20 వరల్డ్‌ కప్‌ ఆడనున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకొని అతనిపై ఎక్కువ పనిభారం వేయకూడదనే నిర్ణయానికి వచ్చాం’ అని కోహ్లీ తెలిపాడు. ‘హార్దిక్ పాండ్యా సేవలు ఎప్పుడు ఎక్కడా వాడాలనేదానిపై మాకు పూర్తి క్లారిటీ ఉంది. హార్దిక్ బ్యాటింగ్‌ నైపుణ్యంతో పాటు బౌలింగ్‌ సేవలు కూడా మాకు చాలా అవసరం. అందుకే ఈ సిరీస్‌లో అతనితో బౌలింగ్‌ చేయించడం లేదు అని అన్నాడు.

Related posts