telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం … రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదు..

huge earth quake in cuba and jamaika sea

కరేబియన్ ద్వీప దేశాల సముదాయంలోని జమైకా, క్యూబా మధ్య సముద్రంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. భూకంప ప్రభావం పొరుగునే అమెరికా, మెక్సికోపైనా పడింది. క్యూబాకు సమీపంలో ఉన్న ఫ్లోరిడా, మెక్సికో సిటీల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కరేబియన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. మూడు అడుగుల ఎత్తు వరకు కెరటాలు ఎగిసి పడే ప్రమాదం ఉందని ప్రకటించింది.

దీని ప్రభావం క్యూబా ప్రధాన నగరం శాంటియాగోపై తీవ్రంగా పడింది. శాంటియాగోలోని పలు ప్రాంతాల్లో భయాందోళనలు తలెత్తాయి. స్థానికులు తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్ల మీదికి పరుగెత్తారు. వందలాది మంది ఒకేసారి రోడ్ల మీదికి వచ్చారు. సాయంత్రవ వరకూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. జమైకాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. రోడ్లన్నీ జనసమ్మర్థం అయ్యాయి. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టాలు చోటు చేసుకున్నట్లు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్యూబా, జమైకాలతో పాటు కేమెన్ ఐలండ్స్, హోండూరస్, మెక్సికో, బెలిజే వంటి దేశాల తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భూకంప తీవ్రత ప్రభావానికి మెక్సికో తీర ప్రాంత నగరమైన క్వింటానో రూలో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయని గవర్నర్ కార్లోస్ జొవాక్విన్ వెల్లడించారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే.. ప్రాణనష్టాన్ని వీలైనంత వరకూ తగ్గించడానికి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలను సిద్ధం చేశామని అన్నారు.

Related posts