telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యాని ఫ్రీ…

Locust-Biryani

మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ పేరుతో మరింత విస్తృతంగా వ్యాక్సినేషన్ కొనసాగించాలని మొన్న అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే ల్పన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యానీ ఫ్రీ అంటూ కొత్త ఆఫర్ తెచ్చింది. టీకా ఉత్సవ్‌లో భాగంగా  ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు ఉచితంగా బిర్యానీ అందిస్తామని ఓ ప్రకటన చేసింది ‘హలో కిచెన్’ అనే సంస్థ.. ఆ సంస్థకు చెందిన  విజయనగరం, కాకినాడలో బ్రాంచీలో ఈ ఉచిత బిర్యానీ ఆఫర్ అందుబాటులో ఉంటుందని… సోషల్ మీడియా ఓ ప్రకటన వదిలారు.. అయితే, ఏ ఆఫర్‌కు అయినా.. కింద షరతులు వర్తిస్తాయి అని చిన్న అక్షరాలతో రాసి ఉన్నట్టు.. ఇక్కడ కూడా షరతులు ఉన్నాయి.. వ్యాక్సిన్ తీసుకున్నట్టు రశీదు చూయిస్తేనే బిర్యానీ ఫ్రీగా ఇస్తారు.. అది కూడా తొలి వంద మందికి మాత్రమే.

Related posts