telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ సోలార్ పవర్‌ ప్రాజెక్టు పథకంలో మార్పులు…

ఏపీ‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 వేల మెగావాట్ల సోలార్ పవర్‌ ప్రాజెక్టు పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది… కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. సోలార్ పవర్‌ ప్రాజెక్టు నుంచి తీసుకునే విద్యుత్‌ టారిఫ్‌ను తగ్గించుకునేందుకు స్కీములో మార్పులు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. పీపీఏ కాలపరిమితిని 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. పీపీఏ కాలపరిమితి ముగిశాక సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును ప్రభుత్వానికి చెందిన ఏపీజీఈసీఎల్‌కే ప్రాజెక్టు డెవలపర్‌ అమ్మాలనే నిబంధన పెట్టింది.. పవర్‌ ప్రాజెక్టుకు కేటాయించిన భూముల లీజు మొత్తాన్ని తగ్గించారు.. గతంలో పట్టా, అసైన్డ్‌ భూముల లీజు మొత్తాన్ని ఏడాదికి రూ. 31 వేలుగా ఉంటే.. ఇప్పుడు రూ. 25 వేలకు కుదించారు.. ల్యాండ్‌ ఓనర్‌కు ఇచ్చే లీజు రూ. 25 వేలకే పరిమితం చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లీజు కుదింపు ద్వారా విద్యుత్‌ టారిఫ్‌లో కూడా ఆ మేరకు తగ్గుదల ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సర్కార్.. గ్రీన్‌ షూ ఆప్షన్ ద్వారా 50 శాతం అదనపు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేలా డెవలపర్‌కు వెసులుబాటు కల్పించింది. 

Related posts