telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

భారత్ కూడా … డ్రగ్ సరఫరా దేశం .. : ట్రంప్

trump in america president election race

ట్రంప్ మరోసారి భారత్ పై నోరు పారేసుకున్నాడు. డ్రగ్స్ సరఫరా చేసే 20 ప్రధాన దేశాల సరసన ఇండియాను కూడా చేర్చారు. బహమాస్, బొలీవియా, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, పనామా, మెక్సికో, గ్వాటెమాలా, పెరూ, జమైకా, వెనిజులా ఇలాంటి 20 దేశాల్లో భారత్ కూడా ఉందంటూ ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియోకు నివేదిక సమర్పించారు. అంతర్జాతీయ కౌంటర్ మాదక ద్రవ్యాల ఒప్పందాల ప్రకారం తమ బాధ్యతలను పాటించడంలో బొలీవియా, వెనిజులా విఫలమయ్యాయని తెలిపారు. కొలంబియాలో కోకా, కొకైన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని..దాన్ని అరికట్టేందుకు ఆ దేశంతో కలసి పనిచేస్తామన్నారు. 2023 చివరి నాటికి కోకా, కొకైన్ ల ఉత్పత్తిని సగానికి తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.

యూఎస్ లోకి ప్రవేశించే ప్రాణాంతక డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు ఇంకా చర్యలు తీసుకోవలసిన అవసరముందన్నారు. కొలంబియా,వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మాదక ద్రవ్యాలను నిరోధించడానికి ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సరిహద్దులను బలోపేతం చేయడం, అక్రమ మాదకద్రవ్యాల వాడకాన్ని నివారించడానికి చాలా నిధులు కేటాయించిందని తెలిపారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తిప్పికొట్టడంలో పురోగతి సాధిస్తున్నాం. ఇంకా సాధించాల్సిన అవసరముందన్నారు. 2019లో 68వేల 557 డ్రగ్ డెత్ కేసులు నమోదయ్యాయని..2018 కంటే ఇవి ఎక్కువన్నారు. నిజానికి ఇలాంటి చీకటి వ్యాపారాలకు ఆజ్యం పోసేది అగ్రరాజ్యాలు.. వాళ్ళ వ్యాపారం కోసం ప్రారంభిస్తారు.. చివరికి ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడ్డప్పుడు.. చర్యలు అంటూ సన్నాయినొక్కులు నొక్కుతుంటారు. ఇదికూడా అందరికి తెలిసిన విషయమే, అయినా ఆ అందరు సైలెంట్ గా లేరు, మనము అంతే ఉండాలి!!

Related posts