telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: లోకేశ్

Nara Lokesh

ఏపీలో ఉల్లి పంటకు మద్దతు ధర లభించక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తెలిపారు. ఉల్లి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 34 లక్షల క్వింటాళ్ల ఉల్లి దిగుబడి వస్తోందని తెలిపారు. అయితే ఉల్లిసాగు చేసిన రైతులు పంటను కొనేవాళ్లు లేక, సరైన మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

ఎకరాకు రూ.80 వేల వరకు ఖర్చు చేసి ఉల్లిపంట వేసిన రైతులకు కంట కన్నీరే మిగిలిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి పంటల అమ్మకాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూలు మార్కెట్ యార్డు కరోనా తీవ్రత కారణంగా మూతపడిందని అన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా సచివాలయాల వద్ద కొనుగోళ్లు జరగడంలేదని వెల్లడించారు. రాష్ట్ర సర్కారు వెంటనే స్పందించి ఉల్లిపంటలను రైతుల వద్ద నుండి వారి గ్రామంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts