telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

తాటిబెల్లం తో .. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

tatibellam for health

ఆరోగ్యం కోసం మనిషి ఎంతైనా వెచ్చించేందుకు…ఎంత కష్టమైనా భరించేందుకు సంసిద్దమవుతున్నాడు. కారణం నిత్యజీవితంతో ఎన్నో విధాలా అనారోగ్యం పొంచి ఉండటమే. ఆరోగ్యమైన లేదా అనారోగ్యంగా తినే ఆహారంలోనే ఉంటుంది. శరీరానికి హాని చేసేవి తింటే రోగాలు…మేలు చేసేవి భుజిస్తే ఆరోగ్యమూ సంప్రాప్తించడమూ సహజమే. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. మేలు చేసే ఆహార పదార్థాల్లో తాటి బెల్లం ఒకటి. ఈ విషయాన్ని పూర్వీకుల నుంచి నేటి కాలం వరకూ అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. తాటి బెల్లం విశిష్టత గురించి 100 సంవత్సరాల క్రితం ‘వస్తుగుణ దీపిక’లో రాసి ఉందట. అందుకే ఎక్కడైనా తాటి బెల్లం అమ్మకానికి వస్తే ధర కాస్త ఎక్కువైనా కొనేందుకు జనం ఎగబడతారు.

తాటిబెల్లం ప్రయోజనాలు :

* తాటిబెల్లంలో విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం పోగొడుతుంది.
* జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పరుస్తుంది.
* ఐరన్‌ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది.
* యాంటాక్సిడెంట్ల కారణంగా శరీరంలో దెబ్బతిన్న కణాలను సరిదిద్దడంలో సహకరిస్తుంది.
* కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌ కూడా ఉంటుంది.
* శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలనూ తొలగిస్తుంది.
* దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూకస్‌ తొలగించడంలోనూ సాయపడుతుంది.
* మైగ్రేన్‌, బరువు తగ్గడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఈ బెల్లంలో చిన్నపాటి జబ్బుల నుంచి అనీమియాను సైతం దూరం చేసే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్ చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Related posts