telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీని తక్కవ చేస్తూ మాట్లాడినందుకు పాక్ క్రికెటర్ ఆగ్రహం…

మైకేల్ వాన్ పై పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌తో పోల్చుతూ మైకేల్ వాన్‌ సరికొత్త చర్చకు తెరలేపాడు. విలియమ్సన్‌ భారత్‌లో జన్మించి ఉంటే కోహ్లీని వెనక్కు నెట్టి వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా నిలిచేవాడన్నాడు. ఇక్కడ విలియమ్సన్ కన్నా విరాట్ కోహ్లీ తక్కువా అనే ఉద్దశేంతో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ”వన్డే ఫార్మాట్‌లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేని వాన్‌ అర్ధరహితమైన చర్చలకు తెరలేపుతూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడంటూ చురకలంటించాడు. 86 వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒక్క శతకం కూడా నమోదు చేయలేని ఆటగాడు చర్చల్లో పాల్గొనేందుకు అనర్హుడని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు నమోదు చేసి అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌, పాంటింగ్‌ తర్వాత మూడో స్థానంలో నిలిచిన కోహ్లీని ఇతర క్రికెటర్లతో పోల్చడాన్ని పాక్ వెటరన్ ఓపెనర్ తప్పుబట్టాడు. ‘అధిక జనాభ గల దేశానికి కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతని టాప్ పెర్ఫామెన్స్‌తో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే అతను 70 సెంచరీలు నమోదు చేశాడు.

Related posts