telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ నుండి సీత వచ్చేస్తుంది…

rrr

దర్శక ధీరుడు రాజమోళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కనిపించనుంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఈ సినిమా 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇక తాజాగా ‘సీత’ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫస్ట్ లుక్ ను మార్చి 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రం బృందం తెలిపింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి సీత ఎలా ఉండనుంది అనేది.

Related posts