telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీలో గుడిసెలు వేసుకున్న రైతులు…

కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా గత వందరోజులుగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. రకరకాల పద్దతిలో రైతులు తమ నిరసనలు తెలుపుతున్న… కేంద్రం తో ఎన్ని సమావేశాలు జరిగిన దీనికి ఒక్క సమాధానం రావడం లేదు. అయితే కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదని తెగించి చెప్పారు.  చలిని, వర్షాన్ని లెక్క చేయకుండా దూకుడుగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు.  అయితే, కేంద్రం కూడా సాగు చట్టాలను వెనక్కి తీసుకునే సమస్య లేదని, మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. రైతులు మాత్రం పూర్తిగా వెనక్కి తీసుకునేవరకు వెనక్కి తగ్గబోమని అంటున్నారు.  ఎండాకాలం రావడంతో రైతులు ఢిల్లీ శివారు ప్రాంతంలో తాత్కాలిక గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.  తాడోపేడో తేల్చుకునే వరకు ఢిల్లీని వదిలి వెనక్కి వెళ్లబోమని తెగేసి చెప్తున్నారు.  తాత్కాలిక గృహాల్లోని జిమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని కేంద్రంపై పోరాటం చేసేందుకు శారీరకంగా కూడా సన్నద్ధం అవుతున్నారు. చూడాలి మరి ఈ నిరసనలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అనేది.

Related posts