చిన్నపిల్లలకు ప్రేమతో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ దయాదాక్షిణ్యాలు లేకుండా దారుణంగా హింసించింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ ఎలిమెంటరీ స్కూల్లో లైబ్రరీ క్లాస్ జరుగుతోంది. ఆ విద్యార్థుల్లో ఓ పాప.. టీచర్ కంటపడకుండా ఉండేందుకు కొంచెం దూరంగా ఓ బుక్‌షెల్ఫ్ పక్కన కూర్చుంది. ఆ పాపను చూసిన టీచర్ కోపంగా ఆమె వద్దకు వెళ్లింది. టీచర్ రావడం చూసిన ఆ చిన్నారి.. బుక్‌షెల్ఫ్‌లో దూరింది. అక్కడకు వచ్చిన టీచర్ బలవంతంగా ఆ చిన్నారిని బుక్‌షెల్ఫ్‌లోంచి లాగిపడేసింది. కిందపడ్డ ఆ పిల్లను కాళ్లతో తన్నింది. ఇదంతా క్లాసులోని సీసీకెమెరాలో రికార్డయింది. సాయంత్రం ఇంటికెళ్లే సమయంలో పాప ఒంటిపై గాయాలు చూసిన తల్లి.. ఆ టీచర్‌ను సంప్రదించింది. బుక్‌షెల్ఫ్‌లో దూరడం వల్లే పాపకు ఆ దెబ్బలు తగిలుంటాయని ఆ టీచర్ అబద్ధాలు చెప్పింది. ప్రిన్సిపాల్‌ను కలిసిన ఆ తల్లి.. తనకు వీడియో చూపించాలని ఒత్తిడి చేసింది. ఆ వీడియో చూసి షాకైన ఆమె స్కూలు యాజమాన్యాన్ని నిలదీసింది. దీంతో ఆ టీచర్‌ను సస్పెండ్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది.