telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల…

దేశంలో మొత్తం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో తమిళనాడు ఒక్కటి. అయితే ఏప్రిల్ 6 వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం కోసం అన్నిపార్టీలు  ఎన్నికల హామీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.  డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోను ఈరోజు రిలీజ్ చేసింది.  ఇందులో ప్రధానంగా పెట్రోల్, వంట గ్యాస్ ధరలను గురించి పేర్కొనడం విశేషం.  పెట్రోల్ ధరలను ఐదు రూపాయల వరకు తగ్గిస్తామని డీఎంకే నేత స్టాలిన్ పేర్కొన్నారు.  అదే విధంగా వంట గ్యాస్ పై రాయితీ ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా మహిళలకు 12 నెలల ప్రసూతి సెలవులు కల్పిస్తామని కూడా డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నది.  మంత్రులపై అవినీతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.  పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ట్యాబ్ లు, తమిళనాడులో కలైంగర్ క్యాంటిన్లు, బియ్యం కార్డు దారులకు రూ.4 వేలు సహాయం, మధ్యాహ్న భోజన సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు, శాసనసభా సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం వంటి హామీలతో కూడిన మ్యానిఫెస్టో ను డీఎంకే ఈరోజు రిలీజ్ చేసింది.  చూడాలి మరి మ్యానిఫెస్టో ప్రజల పైన ఏ మాత్రం ప్రభావం చూపుతుంది అనేది.

Related posts