మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాలి. అది మన అందరి బాధ్యత. ఎందుకంటే మనం ఆరోగ్యంగా లేకపోతే.. నష్ట పోయేది మనం.. మన కుటుంబమే కదా? కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే… భగ భగ మండే ఎండాకాలం వచ్చేసింది. ఇప్పటికే ఎండలు దంచికోడుతున్నాయి. ఎండలో బయటికు వెళ్లే వాళ్ళు కచ్చితంగా కొన్ని ఆరోగ్య నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీని వడ దెబ్బకు చెక్ పెట్టచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నియమాలు :
బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు నీరు తాగాలి
దాహం లేకపోయినా నీరు ఎక్కువగా తాగాలి
ఉప్పు కలిపిన మజ్జిగ ఎక్కువ సార్లు తాగాలి
రోజు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలి
వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి
ఉప్పు కలిపిన నీళ్లు, గ్లూకోజ్ తాగాలి
లైట్ కలర్ ఉండే బట్టలు వేసుకోవాలి
తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాలి
శరీరం డీహైడ్రెట్ కాకుండా ఓఆర్ఎస్ తీసుకోవాలి
“శాశ్వతంగా లాక్-డౌన్”… రానా పెళ్లిపై అక్షయ్ కుమార్ రియాక్షన్