హైదరాబాద్ సమీపంలో నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న బెంజ్ కారులో వచ్చిన ఫైజల్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతనిని అక్కడివారు హుటాహుటిన గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
టీఎస్09యుబి6040 అనే బెంజ్ కారులో గురువారం మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డుపైకి వచ్చిన ఫైజల్ కారును ఆపేసి తనకు తానుగా కాల్చుకున్నాడు. అయితే ఫైజల్ బెంజ్ కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఫైజల్ ఖైరతాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని వీసా కన్సాల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఆర్ధిక సమస్యలు ఉన్నట్లు తెలియవచ్చింది. ఆ కారులో ఒక్కడే ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.