telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ ను దేశ ద్రోహి అన్న వారిపై చర్యలు తీసుకుంటాం…

ముఖ్యమంత్రిని దేశ ద్రోహి అని మాట్లాడుతున్నారు. దేశ ద్రోహం అనే పదానికి అర్థం తెలుసో తెలియదో అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. 150 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం లోకి వెళ్లిన పార్టీ టిఆర్ఎస్. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే  కాంగ్రెస్ బీజేపీలదే చీకటి ఒప్పందం. నిజామాబాద్, దుబ్బాక లో ఒకరికి ఒకరు ఓట్లు వేసుకున్నారు అని తెలిపారు. తోడు దొంగల్ల ప్రవర్తిస్తూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రేస్, బీజేపీ అని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు సమయం లో కాంగ్రెస్ ద్రోహం చేస్తే.. రాష్ట్రం ఏర్పడిన తరువాత బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది అన్నారు. మొదట వరద సహాయం నిలిపేయాలని బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు లేఖ రాసాయి. కానీ ఇప్పుడు మేము చెప్పలేదని డ్రామాలాడుతున్నారు. ప్రజల మీద ప్రేముంటే వరద సహాయం అందించాలని మరో లేఖ రాయాల్సింది అని సూచించారు. గుజరాత్, యూపీ లో చలాన్ లు బీజేపీ ప్రభుత్వాలే కడుతున్నాయా అని ప్రశ్నించారు. తప్పుచేసిన వారికి చలాన్ లు వేస్తారు. తప్పులను మీరు.ప్రోత్సహిస్తున్నారా, నేరస్తులకు బీజేపీ అండగా ఉంటుందా అని అడిగారు. హైద్రాబాద్ నగర అభివృద్ధి మీద చర్చకు మేము సిద్ధం. గుడి కైనా ,బడి కైనా వస్తాం అని చెప్పిన ఆయన తిట్లు, వొట్లతో ఓట్లు రావు అని చెప్పారు. కేసీఆర్ ను ఉగ్రవాది, దేశ ద్రోహి అన్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రా, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలన్నీ మీ వద్దే ఉన్నాయి..ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు. అసదుద్దీన్ తో మోడీ ఎందుకు సమావేశమయ్యారో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఎంఐఎం ఉగ్రవాద సంస్థ అయితే మోడీ ఎందుకు భేటీ అయ్యారు అని ప్రశ్నించారు.

Related posts