telugu navyamedia
రాజకీయ వార్తలు

పౌరసత్వ చట్ట వ్యతిరేకులు.. కొరియా వెళ్లిపోగలరు.. : తథాగత రాయ్‌

meghalaya governor comments on nrc

మేఘాలయ గవర్నర్‌ తథాగత రాయ్‌ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి వివాదాస్పదంగా స్పందించారు. అలాంటి వారు నార్త్‌ కొరియాకు వెళ్లిపోవచ్చని సూచించారు. పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన రెండు వాస్తవ విషయాలను వివాదాస్పదంగా ఎప్పుడూ చూడకూడదు. 1. దేశ విభజన మతం కారణంగా జరిగింది. 2. విభజిత ప్రజాస్వామ్యం ఈ దేశానికి అవసరం. ఈ రెండింటిపై ఎవరైనా విభేదిస్తే వారు నిరభ్యంతరంగా ఉత్తర కొరియాకు వెళ్లొచ్చు అని అన్నారు.

గవర్నర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహించిన నిరసనకారులు రాజభవన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలను దాటి లోపలికి ప్రవేశించాలని యత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్‌ జరిపారు. అనంతరం టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులతో పాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

Related posts