telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఫ్లైట్ ఎక్కబోయిన యస్ బ్యాంక్ ఫౌండర్ కుమార్తె… అడ్డుకున్న అధికారులు …

yes-bank

యస్ బ్యాంక్ సంక్షోభం,మనీ లాండరింగ్ వంటి పలు ఆరోపణలతో ఇప్పటికే యస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లండన్ వెళ్లేందుకు ప్రయత్నించిన రానా కపూర్ కూతురు రోషిణీ కపూర్ ను ముంబై ఎయిర్ పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. ఆదివారం ముంబై కోర్టు రాణాకపూర్ ని మార్చి-11,2020వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. సీబీఐ కూడా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. విచారణ కొనసాగుతున్నందున రాణా కపూర్ కుటుంబసభ్యులపై లుక్ ఔట్ నోటీస్ జారీ అయింది. ఈ సమయంలో లండన్ ఫ్లైట్ ఎక్కే సమయంలో రోషినీ కపూర్ ని అధికారులు అడ్డుకున్నారు. ఆదివారం రాణా కపూర్ అరెస్ట్ కు కొద్ది సేపు ముందే ఆయన కూతురుకి చెందిన మొంబై,ఢిల్లీ నివాసాల్లో ఈడీ సోదాలు జరిపింది. యస్ బ్యాంక్ దేవాన్ హౌసింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క రూ .3,700 కోట్ల విలువైన డిబెంచర్లను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ రాణా కపూర్ ముగ్గురు కుమార్తెలు రోషిణీ కపూర్, రాఖీ కపూర్,రాధా కపూర్ లకు చెందిన డోయిట్ అనే సంస్థకు రూ .600 కోట్ల రుణం మంజూరు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయవాది ఇవాళ కోర్టులో ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యస్ బ్యాంకుపై మారటోరియం విధించి, నగదు ఉపసంహరణపై రూ .50 వేల పరిమితిని విధించిన తరువాత యెస్ బ్యాంక్‌పై ప్రజల ఆగ్రహం కారణంగా తన క్లయింట్‌ను “బలిపశువు” గా మార్చారని కపూర్ న్యాయవాది జైన్ ష్రాఫ్ కోర్టులో వాదించారు.

Related posts