telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శివ ప్రసాద్ చలువ వల్లే స్టార్ హీరోయిన్ గా రోజా…!

Sihva

తెలుగుదేశం మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు ఎన్‌.శివ‌ప్ర‌సాద్ శనివారం అనారోగ్యంతో క‌న్నుమూశారు. నటనపై ఉన్న ఆసక్తితో రాజ‌కీయాల్లోకి రాక‌ముందు, వచ్చిన తర్వాత సినీ న‌టుడిగా తనదైన న‌ట‌న‌తో సినిమాల్లో ప‌లు పాత్ర‌ల‌తో మెప్పించారు. కాగా… స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన రోజాను హీరోయిన్ గా పరిచయం చేసింది శివ ప్రసాదే. 25కి పైగా సినిమాల్లో నటించిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన డైరక్ట్ చేసిన “ప్రేమ తపస్సు”, “టోపీ రాజా స్వీటీ రోజా” చిత్రాల్లో రోజా హీరోయిన్ గా కనిపించారు. కథానాయికగా “ప్రేమ తప్పస్సు” సినిమా ద్వారా రోజా సినీ తెరకు పరిచయం అయ్యారు. అయితే సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ శివ ప్రసాద్ తన రెండవ సినిమా “టోపీ రాజా స్వీటీ రోజా”లో కూడా రోజాను కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తరువాత రోజా తమిళ్ తెలుగులో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇక శివ ప్రసాద్ మేకింగ్ స్టైల్. దర్శకుడిగా తన పనితాన్ని ఆ సినిమాల ద్వారా చూపించారు. ఆ రెండు సినిమాలతోనే హీరోయిన్ గా రోజా క్లిక్కయ్యారు. 1991లో రిలీజైన ఆ సినిమాకు హీరో రాజేంద్ర ప్రసాద్ సంగీతం అందించడం విశేషం. అనంతరం శివ ప్రసాద్ ఇల్లాలు, కొక్కరకొ కో వంటి రెండు సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తరువాత దర్శకుడిగా కంటే నటుడిగా శివప్రసాద్ బిజీ అయ్యారు.

Related posts