telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్య ఎడమ చేతికి గాయం

Surya

తమిళ స్టార్ హీరో సూర్యకు కోలీవుడ్, టాలీవుడ్‌లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి అభిమాని హీరోకు గాయాలయ్యాయన్న వార్త ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది. సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ విషయాన్ని సూర్య సన్నిహితులు, బంధు వర్గాలు నిర్ధారించాయి. దీంతో ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే గాయం 90 శాతం నయం అయిందని వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సూర్య కూడా దీనిపై స్పందించారు. తనకు తగిలిందిపెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రస్తుతం సూర్య, హరి దర్శకత్వంలో ‘అరువా’ చిత్రంలో నటిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. సూర్య ఇప్పటికే సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక కథానాయకిగా నిర్మించిన పొన్‌మగళ్‌ వందాళ్‌ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది.

Related posts