బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివరిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. షారూఖ్ ఖాన్‌కి దేశ విదేశాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా షారుక్ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి బయటకొచ్చింది. షారుక్ కొత్త సినిమా పేరు ‘సంకి’. తమిళ దర్శకుడు ఆట్లీ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. నవంబర్ 2న షారుక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్ చేశాడు. ఆట్లీ దర్శకత్వం వహించిన మెర్సల్ రీమేక్ లో షారుక్ నటిస్తాడని తొలుత వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కనుంది.
next post