telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ వివేకాను ఇంటి దొంగలే హత్య చేశారు: చంద్రబాబు

Chandrababu fire sakshi media

వైఎస్ వివేకానందరెడ్డిని ఇంటి దొంగలే హత్య చేశారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దారుణంగా హత్య జరిగితే హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించారని దుయ్యబట్టారు. హత్య జరిగితే రక్తపు మరకలు ఎవరైనా తుడిచేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా నిర్వహించామన్నారు. తెలుగుదేశం పార్టీకి సేవకు మారుపేరని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిచెప్పారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందీపొట్లు వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పేదరికం లేని ఆనందకరమైన రాష్ట్ర నిర్మాణం దిశగా తాను ప్రణాళికలు చేపడుతున్నానని తెలిపారు. హేతుబద్ధత లేని విభజన వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నామని సీఎం వెల్లడించారు.5 లక్షల మంది నిరుద్యోగులకు రూ.2000 నిరుద్యోగ భృతిని ఇస్తున్నామన్నారు.

ఉద్యోగులకు జీతాలు పెంచడంతో పాటు పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. వంద ఓట్లకు సేవామిత్ర, బూత్‌ల వారీగా కమిటీలు, ఎనిమిది నుంచి 10 బూత్‌లకు ఒక ఏరియా కో ఆర్డినేటర్‌ను పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్రాన్ని సురక్షితంగా గమ్యాన్ని చేర్చడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానని అన్నారు.

Related posts