telugu navyamedia
రాజకీయ వార్తలు

సైనికుల బలిదానాన్ని దేశం ఎన్నటికి మరవదు: మోదీ

narendra-modi

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో సైనికుల బలిదానాన్ని భారత్‌ ఎప్పటికీ మరచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2019 ఫిబ్రవరి 14న భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్‌పై పు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లు మరణించారు.

పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్పందిస్తూ.. గతేడాది జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారు దేశానికి సేవ చేయడానికి, దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు అని అన్నారు.

Related posts