telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లేడీ జర్నలిస్ట్ పై స్టార్ హీరో వల్గర్ కామెంట్

Jim

ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ ఓ లేడీ జర్నలిస్ట్‌పై వల్గర్ కామెంట్ చేసి వార్తల్లో నలిచాడు. ఆయన నటించిన ‘సోనిక్ ది హెడ్జ్‌హాగ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ మ్యాగజైన్‌కు జిమ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అతన్ని చార్లట్ అనే లేడీ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసారు. ఈ సందర్భంగా చార్లట్ జిమ్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘ఈ సినిమాలో మీరు పోషించిన పాత్రకు బకెట్ లిస్ట్ (చనిపోయే లోపు ఏం పనులు చేయాలో రాసుకునే లిస్ట్) ఉంటుంది. అలా మీకు కూడా ఏమైనా బకెట్ లిస్ట్ ఉందా?’ అని అడిగారు. ఇందుకు జిమ్ సమాధానంగా ‘మీరే’ అన్నాడు. దాంతో ఆ జర్నలిస్ట్ షాకయ్యారు. ఆ తర్వాత చార్లట్ ప్రొఫెషనల్‌గా ఇంటర్వ్యూను హ్యాండిల్ చేసారు. అయితే ‘నా బకెట్ లిస్ట్‌లో ఉన్నది నువ్వే’ అని ఓ జర్నలిస్ట్‌ని పట్టుకుని అన్నందుకు జిమ్ కనీసం సారీ కూడా చెప్పలేదు. పోనీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా చెప్పలేదు. దాంతో ఇతర సెలబ్రిటీలు, నెటిజన్లు జిమ్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. అతను జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనంటూ చాలా మంది నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

Related posts