telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకు విరాళం ఇవ్వాలనిపిస్తే ఇస్తా… ఉచిత సలహాలు ఇవ్వకండి

sruthi

ఈ మధ్యనే తను డ్రింక్ చేసే విషయం గురించి ముక్కుసూటిగా సమాధానం చెప్పింది శృతిహాసన్‌. ఎందుకు మానేశానో డేర్ గా చెప్పింది. అలాంటి మనస్థత్వం శృతిహాసన్‌ది. తాజాగా సోషల్‌ మీడియాలో తనను ట్రోల్‌ చేసిన నెటిజన్స్‌కు దీటైన సమాధానం చెప్పారు శ్రుతీహాసన్‌. అదేమంటే ఈ కరోనా సంక్షోభంలో సెలబ్రిటీలందరూ ఎంతో కొంత విరాళం ఇచ్చి ప్రజలను, ప్రభుత్వాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఏదైనా సమాజానికి ఎంతో కొంత విరాళమో ఇవ్వవచ్చుగా అనే ప్రశ్నలతో నెటిజన్లు శృతిహాసన్‌కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. దీనికి శ్రుతీహాసన్‌ స్పందిస్తూ నన్ను చేయమని చెప్పేవారు ప్రజలకు ఏ మాత్రం సేవ చేస్తున్నారో నాకు తెలియదు. కరోనా కారణంగా మనందర్నీ ఇంట్లోనే ఉండమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే అంత దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు అనే మాటలను నమ్మే వ్యక్తిని నేను. నాకు విరాళం ఇవ్వాలనిపిస్తే తప్పక ఇస్తాను. అంతేకానీ అది ఇతరుల ఆదేశానుసారంగా జరగాలనుకోను. గతంలో నేను సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని పేర్కొన్నారు. దయచేసి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి.. అని చాలా స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చింది శృతిహాసన్.

Related posts