telugu navyamedia
సినిమా వార్తలు

నాగార్జున ‘బంగార్రాజు’ నుంచి మ‌రో అప్డేట్..

అక్కినేని నాగుర్జున హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘బంగార్రాజు. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారు.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర టీజర్ అప్‌డేట్ ఇచ్చారు నాగార్జున.

 

 షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్​ సందర్భంగా ఈ సినిమా టీజర్​ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది చిత్రబృందం.

Akkineni Nagarjuna: Bangarraju: ముహూర్తం పెట్టేసిన నాగార్జున.. కొత్త ఏడాది సరికొత్తగా! - bangarraju teaser update from akkineni nagarjuna | Samayam Telugu

ఈ సినిమా టీజర్‌‌ను రేపు ఉదయం 11 గంటల 22 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య మీసం తీప్పుతున్న‌ స్టైల్ అదిరిపోయింది.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

Related posts