telugu navyamedia
రాజకీయ

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం..ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్‌లో త‌ర‌లింపు

*బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం
*ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్‌లో త‌ర‌లింపు
*ఆస్ప‌త్రికి వెళ్ళి బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ప‌రామ‌ర్శ‌
*ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో లాలూ ఆరోగ్యంపై ఆరా

రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. దీంతో ఆయ‌ను ఎయిర్‌ ఆంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లిస్తున్నారు.

దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తేజస్వీ యాదవ్‌కు ఫోన్ చేసి లాలూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే స‌మ‌యంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్వయంగా వెళ్లి పరామర్శించారు.కుటుంబ సభ్యులను అడిగి ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని తనయుడు తేజస్వి యాదవ్‌ ప్రకటించారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నార‌ని , వీటికి సంబంధించిన చికిత్స ఢిల్లీలో జ‌రుగుతోంది. అందుకే వైద్యం కోసం ఆయన్ను ఢిల్లీకి షిఫ్ట్ చేస్తునట్లు తెలిపారు. ఆరోగ్య ప‌రిస్థితి మ‌రీ విష‌మిస్తే త‌న తండ్రిని సింగ‌పూర్ కు కూడా తీసుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

లాలూ సోమవారం వేకువజామున ఇంట్లో మెట్లపై నుంచి కాలుజారి పడిపోయారు. ఆయన కుడి భుజానికి ఫ్రాక్చర్ అవ‌డంతో పాట్నాలోని పరాస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్‌ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తూ రెండు నెలల క్రితమే బెయిల్‌పై విడుదల అయిన విష‌యం తెలిసిందే.

Related posts