ఈనెల 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ ఆవిర్బావం తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కూడా ఇదే.
ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వడం.. ప్రజల అభివృద్దికి పాటు పడడమే ప్రధాన అజండాగా ఈ ప్లీనరీ సమావేశాలు జరగుతున్నాయి.
గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో ఈ ప్లీనరీ సమావేశం జరగనుంది. ప్లీనరీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైసీపీ ప్లీనరీ కోసం జగన్ దాదాపు 32 కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీలు తమ పనులను పూర్తి చేస్తున్నాయి.
నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో వర్షం కురిసినా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరవుతుండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
8వ తేదీ ఉదయం గంటలకు వైసీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. వైసీపీ ప్లీనరీలో 9 అంశాలపై తీర్మానం చేస్తారు.
ఒక్కొక్క అంశంపై ఐదుగురు మాట్లాడతారు. మహిళ సాధికారిత, దిశ చట్టం, విద్య, వైద్యం, పరిపాలన సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక సాధికారతతో పాటు ఎల్లోమీడియా దుష్ట చతుష్టయం పైన కూడా తీర్మానం ఉంటుందని సమాచారం.
వైసీపీ పార్టీ ఏర్పాటయ్యాక 2011లో మొదటి ప్లీనరీ ఇడుపుల పాయలో నిర్వహించారు. అధికారంలోకి రావడం.. వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నాం… అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏం చేశాం.. మిగిలిన రెండేళ్లలో ఏం చేయాలి అనేది ముఖ్యంగా చర్చించనున్నారు.
మరోవైపు సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు.తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు జగన్ పులివెందుల వెళ్తున్నారు .దీంతో అధికారులు, వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు
డీజీపీ ఠాకూర్ కాన్వాయ్ లో రూ.35 కోట్లు.. సీఎం తరపున పంచటానికే .. : విజయసాయి