telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనాను కట్టడి చేసేందుకే లాక్ డౌన్: మంత్రి ఈటల

Etala Rajender

కరోనా విస్తరణను కట్టడి చేసేందుకే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వ్యాధి వచ్చిందని తెలిపారు.

వైరస్ సోకకుండా అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైరస్ సోకిన వారందరికీ ప్రభుత్వం అవసరమైన చికిత్స అందిస్తోందనన్నారు. చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ఇతర సమస్యలు లేవని మంత్రి చెప్పారు. కరోనా వైరస్ చికిత్స కోసం ప్రస్తత దశలో ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రైవేట్ వైద్య కళాశాలలను కూడా వాడుకుంటామని ఈటల తెలిపారు. కరోనా బాధితుల కోసం ప్రస్తుతం 10 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

Related posts