రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సోదరభావం, మానవ సేవ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో, విదేశాల్లో ఉన్న ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, సోదరభావం, మానవసేవ అనే సందేశాలను బక్రీద్ సూచిస్తున్నది. మన సంస్కృతికి దర్పణం పట్టే ఈ విలువలకు కట్టుబడి ఉందాం అని ఆయన తన సందేశంలో పిలుపునిచ్చారు.
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ముస్లింలకు పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరసోదరీమణులందరికీ జనసేన తరఫున కూడా విషెస్ తెలియజేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బక్రీద్ పర్వదినం త్యాగనిరతికి ప్రతీక అని పవన్ పేర్కొన్నారు. కోరికలు, స్వార్థం, రాగద్వేషాలకు దూరంగా ఉంటూ మానవత్వమే పరమావధిగా మసలుకోవాలన్నదే బక్రీద్ అంతర్యమని, దీన్ని ముస్లిం మతం పాటించే భారతీయులు లక్ష్యంగా చేసుకోవాలని ఆకాంక్షించారు.
భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ముషారఫ్