telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆ వ్యాధి ఉంటె .. తమదేశంలోకి రావద్దంటున్న కువైట్ .. ఖర్చెక్కువ, పనితక్కువట..

no diabetic patients allowed said kuwait

డయాబెటిస్ కు ఎప్పటికప్పుడు చికిత్స తీసుకోవాలి. దీంతో మెడికల్ చికిత్సకు అధిక ఖర్చు అవుతోంది. దీనిని సాకుగా చూపి కువైట్ ప్రభుత్వం ఈ భారాన్ని తగ్గించుకునేందుకు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీబీ, హెపటైటిస్ బీ అండ్ సీ, హెచ్ఐవీ, ఎయిడ్స్ వంటి వ్యాధులు కలిగి ఉన్న ప్రవాసులకు కువైట్‌లో ఉద్యోగం చేయడానికి, నివాసముండటానికి అనర్హులంటూ గతంలో కువైట్ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి డయాబెటిస్‌ని ఒకటి చేర్చేసింది. ఒక్క డయాబెటిస్ నే కాదు దీంతో పాటు మరికొన్ని వ్యాధులను కూడా అందులో చేర్చినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా నిర్ణయంతో డయాబెటిస్ ఉన్న ప్రవాసులు కువైట్‌లోకి ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్లయింది.

ఈ మేరకు కొత్త వ్యాధుల జాబితాను త్వరలోనే అమలు చేయనున్నట్టు ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ ఫహాద్ అల్ గుమ్లాస్ తెలిపారు. ప్రవాసులు మెడికల్ చికిత్సకు సంబంధించి ఎప్పటికప్పుడు తాము జాబితాను అప్‌డేట్ చేస్తుంటామని ఆయన అన్నారు. అయితే డయాబెటిస్‌తో పాటుగా జాబితాలో చేర్చిన ఇతర వ్యాధుల పేర్లను చెప్పడానికి డాక్టర్ ఫహాద్ నిరాకరించారు. అధికారికంగా నిర్థారించిన తర్వాతే ఇతర వ్యాధుల పేర్లను ప్రకటిస్తామని అయన తెలిపారు. కాగా ఇదిలా ఉండగా, అనేమియా వంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాధులను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు అయన తెలిపారు. అయితే ఉపాధి నిమిత్తం కువైట్ కి వెళ్లే ప్రవాసులు ఇది షాకింగ్ విషయం అనే చెప్పాలి.

Related posts