telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ

pensiions ap

ఏపీ  ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రారామభమైంది. ఇందులో భాగంగా ఈ తెల్లవారుజామునుంచే లబ్ధిదారులకు వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ ను అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బయో మెట్రిక్ బదులుగా పెన్షనర్ల చిత్రాలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేశారన్న సంగతి తెలిసిందే.

ఇక రాష్ట్రంలో మొత్తం 58.22 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉండగా, వారికి ఈ నెల పెన్షన్ కోసం ప్రభుత్వం రూ. 1,421.20 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. అన్ని జిల్లాల్లోని 2.37 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఈ డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఒకవేళ లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి పోర్టబిలిటీ విధానంలో పెన్షన్లను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

Related posts