telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్‌ న్యూస్‌ : తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. దీపావళి, పెళ్లిళ్లు ఉండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ. 50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. గఅయితే… తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు నిలకడగా ఉండగా.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 54, 160 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 49, 650 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 51, 930 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ.47, 600 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 300 తగ్గడంతో రూ. 68,100కు చేరింది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి ధరలు తగ్గడం శుభ సుచికమని ప్రముఖులు అంటున్నారు.

Related posts