మొదట అపహరణ అంటూ, అనంతరం శవమై కనిపించగానే, ఆత్మహత్య అంటూ .. కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ మృతి ఒక మిస్టరీగా సాగుతుంది. ఆయన రాసినట్టు వెలుగులోకి వచ్చిన లేఖపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు, ఆడిటర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్‌కు తాను నిర్వహించిన లావాదేవీల గురించి తెలియదని సిద్ధార్థ ఆ లేఖలో పేర్కొన్నారు.
కంపెనీ బోర్డు ఈ లేఖపై విచారణ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. సిద్ధార్థ మరణానంతరం పలు కీలక నిర్ణయాలను బోర్డు తీసుకుంది. బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్‌వీ రంగనాథ్‌ను నియమించింది. అలాగే తాజా పరిణామాలపై న్యాయ సలహా కోసం సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థను బోర్డు నియమించింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నితిన్ బాగ్మనేను నియమించింది.