telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం : స్టాలిన్

stalin dmk

ప్రమాణస్వీకారం చేసిన తరువాత మూడు ఫైల్స్ పై స్టాలిన్ సంతకం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్.  అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు ఉన్న 2.07 కోట్ల కుటుంబాల కు రూ.4వేల రూపాయల చొప్పున సాయం అందించే ఫైల్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతకం చేశారు.  ఇందులో మొదటి నెలలో రూ. 2 వేలరూపాయలు, తరువాత నెలలో రెండు వేల రూపాయలను జమ చేయనున్నారు.  ఇక అంతేకాకుండా రాష్ట్రంలో లీటర్ పాలపై రూ.3 తగ్గింపుకు సంబంధించిన ఫైల్ పై కూడా స్టాలిన్ సంతకం చేశారు.  ఎన్నికలకు ముందు డీఎంకే పార్టీ 500 లకు పైగా హామీలతో కూడిన మ్యానిఫెస్టోను రూపొందించింది.  వాటిల్లో ముఖ్యమైన వాటిని ముందుగా అమలు చేసేందుకు స్టాలిన్ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. అయితే చూడాలి మరి ఇంకా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది.

Related posts