telugu navyamedia
సినిమా వార్తలు

మీడియాపై జీవిత రాజశేఖర్ ఫైర్

Jeevitha-Rajasekhar

ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ న‌టించిన చిత్రం “క‌ల్కి”. ఈ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో రాజ‌శేఖ‌ర్‌, జీవిత మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఓ విలేక‌రి.. “మీరు క‌ల్కి సినిమా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్లో వేలు పెట్టార‌ట క‌దా?” అని జీవిత‌ను ప్ర‌శ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు సీరియ‌స్ అయిన జీవిత ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. “ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 20 కోట్ల రూపాయ‌లు పైనే ఖ‌ర్చ‌యింది. అలాంట‌పుడు డ‌బ్బులు పెట్టిన నిర్మాత‌లకు సినిమా తెర‌కెక్కించిన విధానం న‌చ్చాలి క‌దా! సినిమా నాదైన‌పుడు, నేను డ‌బ్బులు పెడుతున్న‌ప్పుడు సినిమా గురించి ప‌ట్టించుకోకుండా ఎలా ఉంటాను. నేను 30 ఏళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాను. కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. నాకు కొంత ప‌రిజ్ఞానం ఉంది. సినిమా బాగా రావాల‌నే అంద‌రూ ప‌నిచేస్తారు. ఎందుకు మీరు ఇలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారు. `ద‌ర్శ‌క‌త్వప‌రంగా మీరెలాంటి స‌ల‌హాలు ఇచ్చారు?` అని అడ‌గాలి. అంతేకాని `ఎందుకు జోక్యం చేసుకున్నారు? అని అడ‌గ‌కూడ‌దు. ఇలాంటి విష‌యాలు బాధ కలిగిస్తాయి” అని జీవిత చెప్పుకొచ్చారు.

Related posts