telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆటా’ ఆన్‌లైన్‌ పాటల పోటీ ‘ఝుమ్మంది నాదం’

ATA

అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూన్‌, జూలై నెలల్లో ఆన్‌లైన్‌ పాటల పోటీ ‘ఝుమ్మంది నాదం’ నిర్వహించనుంది. క్లాసికల్‌, నాన్‌క్లాసికల్‌ విభాగంలో పోటీలు ఉంటాయని, ఇందులో పాల్గొనేవారు తమ పేర్లను జూన్‌ 7వ తేదీలోపు వెబ్‌సైట్‌ https://tinyurl.com/ATA-JN2020లో నమోదు చేసుకోవాలని తెలిపింది. వీటిని ఆటా ఫేస్‌బుక్‌, ఆటా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయని వెల్లడించింది. సోలో సింగింగ్‌ పేరుతో జూన్‌ నాలుగో వారం నుంచి జూలై చివరి వరకు జరిగే ఈ పాటల పోటీలో అమెరికాలో నివసించేవారు పాల్గొనవచ్చని ఆటా ప్రకటించింది. ఇందులో గెలుపొందినవారికి ఆటా టైటిల్‌ అందిస్తామని తెలిపింది. ఈ పోటీలు నాలుగు విభాగాలుగా (ప్రిలిమనరీ రౌండ్స్‌, ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌, సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌) ఉంటాయని, ఇవి ఆన్‌లైన్‌ (జూమ్‌) ద్వారానే జరుగుతాయని వెల్లడించింది.

Related posts