ఖాదీ సహా ఇతర గ్రామీణ పరిశ్రమల వ్యాపార ఆదాయాన్ని రూ.75,000 కోట్ల(ప్రస్తుత ఆదాయం) నుంచి వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లకు(ఏడాదికి) పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో తన వాటాను 10 శాతానికి పెంచుకోవాలని ఈ పరిశ్రమకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యంలో 17% వాటా కలిగిన చైనా.. పెరిగిన వ్యయాలతో సతమతం అవుతుండడంతో, ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విస్తరించాలని సూచించారు.
ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో గడ్కరీ భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు సుమారు) స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యాలు మౌలిక రంగం, ఎంఎస్‌ఎంఈలకు ఉందన్నారు. ”అంతర్జాతీయ ఎగుమతుల్లో చైనా వాటా 17%. మన వాటా 2.6 శాతమే. దీన్ని 8-10 శాతానికి తీసుకెళ్లగల అవకాశం మన ముందున్నది. ముఖ్యంగా చైనా పెరిగిన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో మన వాటా పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి” అని మంత్రి సూచించారు. దేశంలో అపార వనరులు ఉండి, స్వీయ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నా కానీ.. బొగ్గు, పేపర్‌ను దిగుమతి చేసుకోవడం బాధాకరమన్నారు.
చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారు: లక్ష్మీపార్వతి