telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లూసిఫర్” రీమేక్ నుంచి తప్పుకున్న వినాయక్ ?

chiru

కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం ఆచార్య. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరంజీవి తన తర్వాతి సినిమాను మొదలు పెట్టబోతున్నారట. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ రీమేక్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 2021లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కలకత్తా నేపథ్యాన్ని కథలో యాడ్ చేస్తున్నారట. ఇక 2015లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీలో అజిత్ మాస్ రోల్ ప్రేక్షకులను బాగా మెప్పించింది, ప్రస్తుతం మెహర్ ఈ చిత్రానికి లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో సిరుత్తై శివ తెరకెక్కించిన ఈ సినిమా హిట్ అయింది. అక్కడ అజిత్ పోషించిన పాత్రలో చిరు.. లక్ష్మీమీనన్ పాత్రలో కీర్తి సురేష్ నటించబోతున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు లూసీఫర్ రీమేక్ లో కూడా నటించబోతున్నాడు చిరు. ఈ రీమేక్‌కు ముందు సుజీత్‌ను దర్శకుడిగా తీసుకున్నా కొన్ని కారణాలతో ఆయన్ని తప్పించి వినాయక్ ను తీసుకున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈయన కూడా సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగా వినాయక్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి చెప్పిన మార్పులు వినాయక్‌కు నచ్చకపోవడంతో ఆయన సున్నితంగా తిరస్కరించాడని వార్తలొస్తున్నాయి.

Related posts