telugu navyamedia
సినిమా వార్తలు

ప్ర‌ముఖ సింగ‌ర్ కేకే అకాల మరణం బాధాకరం..-పవన్

ప్ర‌ముఖ సింగ‌ర్ కేకే అకాల మరణంతో దేశంలోని సంగీతాభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. తాజాగా కేకే మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం తెలియచేశారు.

 పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్‌ మూవీ ఖుషిలో 'ఏ మేరా జహా' పాటలో తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు కేకే. ఊపు తెప్పించే ఆ పాట మ్యూజిక్ లవర్స్ మెప్పుపొందింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జతగా భూమిక నటించింది.

”కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు కేకే అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.

 ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (KK) హఠాన్మరణం యావత్ సినీ లోకాన్ని కలచివేసింది. కేకే ఇకలేరని తెలిసి, ఆయన గొంతు మూగబోయిందనే మాట విని యావత్ భారత దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలు భారతీయ భాషల్లో పాటలు పాడి దేశంలోనే ప్రముఖ గాయకుడిగా ప్రసిద్ధి గాంచిన కేకే చివరికి పాటలు పాడుతూనే ప్రాణాలు కోల్పోయారు.

నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం. ‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్… అదోలా’, బాలు సినిమాలో ‘ఇంతే ఇంతింతే’, జానీలో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు. అవన్నీ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు, సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయి.

 ఇక పవన్ కళ్యాణ్ మరో సినిమా జల్సాలో 'మై హార్ట్ ఈజ్ బీటింగ్' అంటూ తనదైన గొంతుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు కేకే. ఈ పాటలో యువత పులకరించిపోయింది.

సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. కేకే గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి అని ప‌వ‌న్ తెలిపారు.

Related posts