telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేనెప్పటికైనా హీరోయిన్ కావాలని అప్పుడే ఫిక్సయ్యా : నిధి అగర్వాల్

nidhi agarwal counter answer to

ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ కావడమే చిన్నప్పటి నుంచి తన లక్ష్యమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి పేర్కొంది. “చిన్నప్పుడు తొలిసారి సినిమా చూసినపుడు నాకెంతో ఆనందంగా అనిపించింది. నేనెప్పటికైనా హీరోయిన్ కావాలని అప్పుడే ఫిక్సయ్యా. అయితే సినీ పరిశ్రమలో నాకు తెలిసిన వాళ్లెవరూ లేరు. అందుకే మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. మోడలింగ్‌లో మంచి పేరు సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు దక్షిణాది నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి” అని నిధి తెలిపింది.

Related posts