భారత పర్యటనకు వచ్చిన హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ హరిద్వార్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానది హారతి కార్యక్రమంలో విల్ పాల్గొన్నారు. వవ విషయాన్నీ విల్ స్మిత్ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. “భారత పర్యటన నాలో చైతన్యాన్ని నింపింది. ఈ పర్యటన ఓ అద్వితీయమైన అనుభవం. విభిన్న వర్గాలు, ఇక్కడి ప్రకృతి అందాలు నాకో కొత్త అనుభూతి. నన్ను నేను తెలుసుకోవడానికి ఇదెంతో ఉపయోగపడింది” అంటూ పోస్ట్ చేశారు విల్. ఈ పోస్టుకు తాను హరిద్వార్ లో దిగిన ఫోటోలను కూడా జత చేశారు. విల్ స్మిత్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు కొన్ని గంటల్లోనే 15 లక్షలకు పైగా లైక్ లు రావడం గమనార్హం. 2017, డిసెంబర్ లో భారత పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హిందూ మతం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని, అప్పటికే తాను 90 శాతం భగవద్గీతను చదివేశానని, తనపై అర్జునుడి ప్రభావం అత్యధికంగా ఉందని, త్వరలోనే రిషికేష్ ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
previous post
next post
నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు