telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియాంక హెయిర్ స్టైల్ ఫై వర్మ స్పందన

Ram gopal Varma Fire Censor board

అమెరికాలో జ‌రిగిన మెట్‌గాలా వేడుక‌లో ప్రియాంక ఫ్యాషన్ వేర్ సోష‌ల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వేడుక‌లో సిల్వ‌ర్ గౌను, పిచ్చుక గూడులాంటి హెయిర్ స్టైల్‌తో ప్రియాంక విభిన్నంగా కన్పించింది. దీంతో నెటిజ‌న్లు ఆమె హెయిర్‌స్టైల్‌పై సెటైర్లు వేస్తున్నారు. “ప్రియాంక ఏంటి? పిచ్చుకు గూడుపై ఏంటెనాలు పెట్టుకొచ్చింది” అంటూ కొంద‌రు నెటిజన్లు కామెంట్లు చేయగా… సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా తాజాగా ప్రియాంక హెయిర్‌స్టైల్‌పై కామెంట్ చేశారు. ప్రియాంక జ‌ట్టును, వీర‌ప్ప‌న్ మీసం కింద అమ‌ర్చిన ఫోటోను షేర్ చేస్తూ “ఎంతో ప్ర‌సిద్ధి చెందిన ఆ మీస‌క‌ట్టు కింద ఈ హెయిర్‌స్టైల్ స‌రిగ్గా స‌రిపోయింది. వీర‌ప్ప‌న్ మీసం త‌ర‌హాలో ప్రియాంక హెయిర్ స్టైల్‌ను మార్చిన ఆ హెయిర్ స్టైలిస్ట్‌కి వ్య‌క్తిగ‌తంగా సెల్యూట్ చేస్తున్నా. ఐ ల‌వ్ ఇట్‌” అంటూ ట్వీట్ చేశాడు. హెయిర్ స్టైల్ కారణంగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది ప్రియాంక.

Priyanka-Chopra

Related posts