telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరీ, నాగ్ కాంబినేషన్ లో మరో సినిమా…!

Nagarjuna

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కింగ్ నాగార్జున వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాగ్ తో సినిమా ఉంటుందట. కరోనా లాక్ డౌన్ లో పూరి నాగ్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. ఈ కరోనా ఖాళీ సమయం తనకు తాజాగా ఆలోచించడానికి అలాగే భిన్నమైన కథలను వ్రాయడానికి అద్భుతమైన అవకాశం అని పూరి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. తాజాగా పూరి స్క్రిప్ట్ పూర్తి చేశాడట. కాగా గతంలో పూరీ, నాగ్ కాంబినేషన్ లో వచ్చిన శివమణి (2003) మరియు సూపర్ (2005) సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

Related posts