telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్టార్‌బక్స్ సైలెంట్ కేఫ్‌… ప్రత్యేకత ఏంటంటే…!

StarBucks

ప్రముఖ కాఫీ చైన్ స్టార్‌బక్స్ చైనాలోని గాంజో నగరంలో నూతన కాఫీ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ కాఫీ స్టోర్‌కు సైలెంట్ కేఫ్ అని పేరు కూడా వచ్చింది. వికలాంగులకు చేయూతనివ్వడం కోసం స్టార్‌బక్స్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ స్టోర్‌లో మొత్తంగా 30 మంది వర్కర్లు ఉండగా.. అందులో 14 మంది వినికిడి సమస్యతో ఉన్నవారే. కాఫీ స్టోర్‌లో కస్టమర్లు కూడా ఆర్డర్ చేయడానికి మాట్లాడరట. తమకు ఏం కావాలో.. ఎన్ని ఆర్డర్లు కావాలో చెప్పేందుకు స్పెషల్‌గా ఓ ఆర్డరింగ్ సిస్టమ్‌ను సంస్థ రూపొందించింది. అందుకనే దీనికి సైలెంట్ స్టోర్ అని పేరు పెట్టారు. తాము మాట్లాడలేకపోయినా కస్టమర్లతో ఒక మంచి కాఫీని మాత్రం షేర్ చేసుకుంటామని నూతన కేఫ్‌లోని కాఫీ మాస్టర్ జు జీయింగ్ చెబుతున్నాడు. వినికిడి సమస్య ఉన్నప్పటికీ.. చైనాలోని స్టార్ బక్స్‌లో మొట్టమొదటిగా జు జీయింగ్ ఉద్యోగం సంపాదించాడు. తన లాంటి వాళ్లకు ఇదొక సదవకాశమని జీయింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Related posts