telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో రెడ్‌ జోన్లు ఇవే..!

Red zone corona

కరోనా కేసుల తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్లలో అధికారులు మార్పులు చేశారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి, లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్రం, రాష్ట్రంలోని రెజ్ జోన్లను, ఆరంజ్ జోన్ల వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో రెండు వారాల క్రితం గుర్తించిన 170 హాట్ స్పాట్స్ సంఖ్యను 129కి తగ్గించింది.

తెలంగాణలో.. ఆరు జిల్లాలు రెడ్ జోన్ లో, 18 ఆరెంజ్ జోన్ లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ రెడ్ జోన్ లో ఉన్నాయి. అధేవిధంగా నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట,ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి గ్రీన్ జోన్లుగా కేంద్రం గుర్తించింది.

Related posts