telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నేటి నుంచి ప్రత్యేక రైళ్లు..లింగంపల్లి నుంచి ప్రారంభం!

Train Indian railway

లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి రైలు ఈ ఉదయం హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి జార్ఖండ్ లోని హాతియాకు బయలుదేరింది. దాదాపు 1,200 మంది వలస కార్మికులు, తెలంగాణలో చిక్కుకుపోయిన జార్ఖండ్ కూలీలు ఈ రైలులో వెళ్లారు. 24 బోగీలను ఏర్పాటు చేసిన అధికారులు, ఒక్కో బోగీలో 72 బెర్త్ లు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరి మధ్యా సామాజిక దూరం ఉండేలా చూస్తూ, 54 మంది చొప్పున మాత్రమే అనుమతించారు.

కాగా, వలస కార్మికులను రోడ్డు ద్వారా మాత్రమే అనుమతించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకించి, రైళ్ల ద్వారా పంపేందుకు సహకరించాలని కోరిన వేళ, కేంద్రం నిబంధనలను సడలించగా, ఆ వెంటనే దక్షిణ మధ్య రైల్వే ఈ రైలును ఏర్పాటు చేసింది. మరోవైపు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సైతం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరిందని ట్వీట్ చేశారు. కేంద్రం తమ డిమాండ్ కు సానుకూలంగా స్పందించిందని అన్నారు. జార్ఖండ్ వచ్చిన వారిని స్వస్థలాలకు తరలిస్తామని, అంతకన్నా ముందే ఆరోగ్య పరీక్షలు జరిపుతామని, వారంతా క్వారంటైన్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

Related posts